బాటసారి మీమాంస

అక్టోబర్ 8, 2008

నేను నా గమ్యం వైపు నడుస్తున్నాను… నా బాటకి ఇరువైపులా ఒక్కోచోట చెట్లు ఉన్నాయి, ఒక్కో చోట లేవు… అలసినప్పుడు చెట్లున్న చోట విశ్రాంతి తీసుకోగలిగాను, చెట్లు లేని చోట అక్కడ మొక్కలు నాటనందుకు గతంలో ఆ బాట వేసినవారిని, అక్కడికి దగ్గరగా నివసించేవారిని నిందించాను… నడుస్తూ నడుస్తూ మధ్యలో ఒక రాత్రి స్నేహితుని దగ్గర బస చేసాను. ఉదయం ఆతనితో పొలం తీసుకెళ్ళాడు. చుట్టూ కంచె వేయబడిన ఆ పొలంలో చాలా వరకు మామిడి తోట ఉంది, ఒక వైపు ఏమీ లేక పిచ్చి మొక్కలతో నిండి ఉంది. తనని అడిగితే అది చౌడు భూమి అక్కడ మొక్క నిలవదు అని చెప్పాడు. నాలో ఆలోచన మొదలైంది. బాటకి చెట్లు లేని చోట నేల కూడా ఇలానే ఉంది!! చాలామందిని నిందించానే అని పశ్చాత్తాప్పడ్డాను…, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆవేశ పడేముందు సమస్య అసలు స్వరూపాన్ని ఆరా తీయాలని… నేను నడక కొనసాగించాను… ఒక్కోచోట బాట వెడల్పుగా, ఒక్కోచోట సన్నగా ఉంది… సన్నగా ఉన్న చోట వెడల్పు చెయ్యొచ్చు కదా అనుకున్నాను.., గమనిస్తే ఆ ఊరివారు ఆ బాటలో బండ్లు నడపడం లేదు, బండ్లకి వేరే దారి ఉపయోగిస్తున్నారు. అది సన్నగా ఉందని, అది వెడల్పుగా ఉంటే బాగుంటుందని నేను చేసిన ఆలోచన అక్కడ ఉన్న ప్రజలకి అసలు సమస్యలానే తోచలేదు. బయటనుండి వచ్చేవారికోసం అక్కడ బాట వెడల్పు పెంచడం వల్ల వారికి ఎప్పటి నుండో అలవాటైన జీవిన విధానం దెబ్బతింటుంది.నేను నడక కొనసాగించాను. బాట ఒక్కోచోట గుంటలతో ఉంది, పరిశీలిస్తే అక్కడ వర్షపాతం ఎక్కువ. ఇంకోచోట ఎత్తు పల్లాల్లాగా ఉంది, చూస్తే అక్కడ రాతిని చదును చెయ్యడం కష్టమైన పనిలా అనిపించింది.నేను ఇంతకుముందులా ఆలోచించి ఉంటే ఆయా సంధర్భాల్లో, ఇతరులని నిందించి ఆవేశం వెల్లగక్కేవాడిని, అలసిపోయి మార్గమధ్యంలోనే గమ్యం వైపు నా ప్రయత్నాన్ని విరమించుకునేవాడిని. సమస్య అసలు రూపాన్ని అర్ధం చేసుకోలేకపోయేవాడిని.నేను నడక కొనసాగిస్తున్నాను… ఏదో ఒకనాడు నా గమ్యం చేరడానికి నేనే ఒక కొత్త బాట వెయ్యాల్సి రావొచ్చు, ఆ అవసరం లేకుండానే నేను నా గమ్యాన్ని చేరవచ్చు… ఏది ఏమైనా సరే, నా ప్రయాణపు అనుభవాలని  నా నడకలో ఉపయోగించుకుంటాను, నా తరవాత నడిచే బాటసారులకి అందిస్తాను…
బాటసారి

Hello world!

అక్టోబర్ 4, 2008

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!


Follow

Get every new post delivered to your Inbox.